Eagle Movie : ఈగల్ రిలీజ్ డేట్ ఫిక్స్...స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X
ఫాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు మాస్ మహారాజా రెడీ అయ్యారు. రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికి..అంతకు తగ్గ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీలో రవితేజ ఉర మాస్ క్యారెక్టర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్లుగా నటించారు. కాగా నవదీప్ కీలక పాత్ర పోషించారు.
రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరిలో నిలవాల్సి ఉంది. అయితే సంక్రాతి బరిలో పోటీ తీవ్రంగా ఉండడంతో మూవీ ఫిబ్రవరికి వాయిదా పడింది. మాస్ మహారాజా యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడు అయ్యాయి. ప్రముఖ ఓటీటీలైన ‘ఈటీవీ విన్’, ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో ఈగల్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మార్చి 1 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ లో తెలుగులో మూవీ రిలీజ్ అవుతుండగా..అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీలోనూ ఈగల్ స్ట్రీమింగ్ కానుంది.