Home > సినిమా > Eagle Movie Review : కనెక్ట్ అయితే బ్లాక్ బస్టరే

Eagle Movie Review : కనెక్ట్ అయితే బ్లాక్ బస్టరే

Eagle Movie Review : కనెక్ట్ అయితే బ్లాక్ బస్టరే
X

రివ్యూ : ఈగల్

తారాగణం : రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అజయ్ ఘోష్, మధుబాల, వినయ్ రాయ్, శ్రీనివాసరెడ్డి తదితరులు .

ఎడిటర్ : కార్తీక్ ఘట్టమనేని, ఉతుర

సంగీతం : దేవ్ జాండ్

సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకీ, కరమ్ చావ్లా

నిర్మాతలు : టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల

దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని

జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్

మాస్ మహరాజ్ గా ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ ఉన్న రవితేజ సినిమా అంటే ప్రస్తుతం కొంత క్రేజ్ తగ్గింది. వరుసగా రొటీన్ సినిమాలే వస్తున్నాయి. కథ, కథనాలు వీక్ గా ఉండటంతో కొన్నాళ్లుగా కమర్షియల్ హిట్స్ కొట్టడంలో కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నాడు రవితేజ. ఇక ఈగల్ చిత్రాన్ని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. సోలో రిలీజ్ డేట్ కావాలని మరీ ఈ శుక్రవారం విడుదల చేశారు. బట్ ఎందుకో ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలు లేవు. అయినా సోలో రిలీజ్ కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు. మరి ట్రైలర్ తో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనరేమో అనిపించుకున్న ఈగల్ ఎలా ఉందో చూద్దాం.

ఈగల్ మూవీని కథగా చూస్తే.. ఢిల్లీలో ఓ ఇంగ్లీష్ పేపర్ లో పనిచేసే అమ్మాయి నిళిని(అనుపమ పరమేశ్వరన్). తను చూసిన ఓ కాటన్ వస్త్రం ప్రత్యేకత, దాన్ని పండించే సహదేవ్ అనే వ్యక్తి గురించీ తెలుసుకుని తన పేపర్లో ఓ చిన్న వార్తగా వేస్తుంది. ఆ వార్త చూసి దేశం ఉలిక్కిపడుతుంది. అతని కోసం పన్నెండు దేశాల వాళ్లు, ఇండియాలోని అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ తో పాటు టెర్రరిస్ట్ లు, నక్సలైట్స్ వెదుకుతుంటారు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ నుంచి ఆ వ్యక్తిని వెదకడం మొదలుపెడతారు. మరోవైపు నక్సల్స్ తో పాటు టెర్రరిస్ట్ లు సైతం అతన్ని అంతం చేయాలని చూస్తుంటారు. ‘రా’ వాళ్లు అతన్ని సహదేవ్ కాదని.. ఈగల్ అనే కోడ్ తో పిలుస్తుంటారు. మరి ఈ సహదేవ్ అలియాస్ ఈగల్ ఎవరు..? ఇంతమంది అతని వెనక ఎందుకు పడుతున్నారు. అతని నేపథ్యం ఏంటీ..? చివరికి సహదేవ్ ను చంపేశారా లేదా అనేది మిగతా కథ.

రవితేజ సినిమా అంటే ఒక సెటప్ లో ఊహించుకోవడం కామన్. అందుకు భిన్నంగా ఈ కథ మొదలవుతుంది. అరగంట వరకూ హీరో ఫేస్ కూడా సరిగా కనిపించకుండా కేవలం అతని ఎలివేషన్స్ తోనే నింపేశాడు దర్శకుడు. ఇవి చూసినప్పుడు కేజీఎఫ్ గుర్తొస్తుంది. సలార్ సన్నివేశాలు మెదులుతాయి. దీంతో ఇదేదో అనవసరమైన బిల్డప్ లా కనిపిస్తుంది.

పత్తి రైతుల ఎపిసోడ్ తో పాటు పత్తి ఫ్యాక్టరీ ఎపిసోడ్ లో పస కనిపించదు. ఆ పాత్ర ఎలివేషన్ కు తగ్గ ఎమోషన్ ఆ సన్నివేశాల్లో కనిపించదు. రవితేజ గెటప్ బావున్నా.. స్క్రీన్ ప్లే వీక్ అనిపిస్తుంది.దీనికి తోడు కథనం నెమ్మదిగా ఉండటంతో ఫస్ట్ హాఫ్ ఈ ఎలివేషన్స్ తో పాటు హీరో ‘స్నైపర్ ’ షాట్స్ తో నిండిపోతుంది. బట్ అతనెవరు.. అనేది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. ఈగల్ అనే ఓ క్రిమినల్ అక్రమ ఆయుధాల వ్యాపారం చేసే వారికి సహాయం చేస్తుంటాడు. ఇందుకోసం స్నైపర్ లా మారి వారికి అడ్డొచ్చేవారిని అంతం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి సడెన్ గా ఇంకెవరూ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండొద్దు అంటూ ఇలాంటి వ్యాపారులను అంతం చేస్తూ.. ఆ ఆయుధాలన్నీ తన వద్దకు తెచ్చుకుని ఓ సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడతాడు. మరి దీనికి కారణం ఏంటీ.. అతను సడెన్ గా అందరి ఆయుధాలనూ కొల్లగొట్టడానికి వెనక ఉన్న వ్యక్తులు ఎవరు..? ఇలా కొల్లగొట్టిన ఆయుధాలను ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ ఏంటీ

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవారికి ఇది పెద్దగా నచ్చే అవకాశం లేదు. బట్ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి కొత్త నేపథ్యంలో కనిపించే లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పటి వరకూ తెలుగులో రాలేదంటే అతిశయోక్తి కాదు. కాకపోతే లవర్స్ తెలిసిపోయిన తర్వాత ఆ ప్రేమకథలో అంత గొప్పదనం కనిపించదు. వీరి మధ్య గొప్ప బంధం ఏర్పడిందనే సన్నివేశాలు కూడా పడలేదు.అయినా బోర్ లేకుండా రూపొందించాడు దర్శకుడు. రవితేజ పాత్ర, ఆహార్యం, సంభాషణలు ప్రధాన హైలెట్ గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ రేంజ్ లో ఉన్నాయి. ఈ కథ మొదలయ్యేది అనుపమ పాత్రపై. ఎండ్ అయ్యేదీ తన పాత్రతోనే. తనే ఈ కథను ముందుకు తీసుకువెళుతుంది. నళిని అనే జర్నలిస్ట్ పాత్రలో తను బాగా చేసింది. అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి ట్రాక్ బావుంది. వినయ్ రాయ్ తో క్లైమాక్స్ లో వచ్చే ఫైట్.. ఆ తర్వాతి సీన్స్ సూపర్బ్. కాప్య థాపర్ పాత్ర పరిమితం. కానీ తన ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం హైలెట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొంత తీసేయొచ్చు. డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మంచి తెలుగు కూడా వాడారు పదాల్లో. దర్శకుడుగా కార్తీక్ కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం కేజీఎఫ్ ను ఫాలో అవుతూ ఎలివేషన్స్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోవడం కొంత సమస్యగా మారింది.

మైనస్ లేంటీ..

ఫస్ట్ హాఫ్ లో అవసరానికి మించిన ఎలివేషన్ సీన్స్ ఇబ్బంది పెడతాయి. ఆ ఎలివేషన్ కు తగ్గ ఎమోషన్ తర్వాతి సన్నివేశాల్లో లేకపోవడంతో అవన్నీ బిల్డప్స్ గా మిగిలిపోతాయి. ఎంతోమంది కాలుస్తున్నా.. హీరోకు ఒక్క బుల్లెట్ తగలకుండా ఉండటం అనే సగటు తెలుగు హీరో లక్షణాన్ని ఎక్కువగా వాడుకున్నారు. లవ్ స్టోరీలో కావాల్సినంత ఎమోషన్ లేదు. శ్రీనివాస్ అవసరాల పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు, ఆ పాత్ర చిత్రణకు తేడా ఉండటం. ఒక్క వ్యక్తి కోసం మిస్సైల్ ప్రయోగించాలనుకోవడం అతిశయోక్తిలా ఉంది. పాటలు ఏమంత గొప్పగా లేవు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే అంశాలేవీ లేవు.

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంలో కనిపించే సినిమా ఈగల్. ఈ తరహా పాత్ర రవితేజకు ఫస్ట్ టైమ్. డ్రగ్స్ తో విసిగిపోయిన తెలుగు సినిమాకు కొత్తగా వెపన్ డీలింగ్ తో కనిపించడం ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ మాస్ మూవీస్ ను ఇష్టపడేవారికి ఈగల్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

చివరగా : యాక్షన్ ఎక్కువ ఎమోషన్ తక్కువ

రేటింగ్ : 2.5/5

బాబురావు. కామళ్ల

Updated : 9 Feb 2024 9:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top