ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఈసీ షాక్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ చూడలేదన్నారు. ఒక వేళ ఆ సినిమా టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు. లేదంటే చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు.
‘భగత్ బ్లేజ్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమాలో పంచ్ డైలాగులు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.. తన రేంజ్‌ను విమర్శించే వారికి ఘాటుగా సమాధానం ఇస్తూ ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్‌కల్యాణ్ కౌంటర్ ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించింది
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.