Home > సినిమా > Esha Deol:విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. పన్నెండేళ్ల కాపురానికి గుడ్ బై

Esha Deol:విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. పన్నెండేళ్ల కాపురానికి గుడ్ బై

Esha Deol:విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. పన్నెండేళ్ల కాపురానికి గుడ్ బై
X

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నాయి. పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా విడిపోతుండడం అభిమానులను బాధించే విషయం. తాజాగా ఈ విడాకుల జాబితాలోకి మరో జంట చేరింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిని కూతురు, నటి ఈషా డియోల్.. తన భర్త భరత్ తక్తానీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వీరి కాపురంలో కలతలు రేగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం 12 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నామని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పింది. అలాగే తమ పిల్లలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది

ఈషా డియోల్.. బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర- హేమామాలిని పెద్ద కూతురు. 21 ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అన్ని భాషల్లో 30 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ధూమ్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో సూర్య సరసన నటించి మెప్పించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టాక వారిని పెంచడంతో ఆ సమయం గడిచిపోయింది. ఇక డిజిటల్ ఓటిటీ లు రావడంతో ఈషా కూడా ఓటిటీలో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక గత కొన్నేళ్లుగా భరత్ – ఈషా మధ్య పడడం లేదని, ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదర్చాలని చూసినా కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలుస్తోంది.

Updated : 6 Feb 2024 9:57 PM IST
Tags:    
Next Story
Share it
Top