ప్రేమ కథ చెప్పమంటే.. ‘నాకు ఆల్ రెడీ ఇద్దరు పిల్లలున్నార’ని షాక్ ఇచ్చిన నటి
X
తెలుగు హీరోయిన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఈషా రెబ్బ. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిప ఈషా.. తనదైన ముద్ర వేసింది. తనపై వచ్చిన ట్రోల్స్ ను పక్కకు నెడుతూ ముందుకు సాగింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఛాన్స్ లు కొట్టేస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడనిపిస్తుంది?’ అని అడిగిన ప్రశ్నకు ‘తొందరపడ్డప్పుడు’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత తన ప్రేమ కథ గురించి అడుగగా.. తనకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పుకొచ్చింది. దీంతో సెట్ లో ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఆ జవాబుతో ప్రోమో ముగుస్తుంది. అయితే, దీనిపై చర్చ మొదలయింది. ఈషా నిజంగానే పిల్లల్ని కనిందా..? లేదా ఎవరినైనా దత్తత తీసుకుందా? అసలు తనకు పెళ్లే కాలేదు కదా. పిల్లలెరా వచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కొందరు ఈషా తన పెంపుడు కుక్క పిల్లల గురించి మాట్లాడింది అంటున్నారు. అయితే, దీనిపై ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు. కాగా పోయిన ఏడాది కోలీవుడ్ డైరెక్టర్ తో ఈషా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.