Amy Jackson : త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్..ఎవరంటే?
X
హీరోయిన్ అమీజాక్సన్ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన "ఎవడు" సినిమాతో తెలుగువారికి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే నటించింది కొన్ని సినిమాలే అయిన..భారీ చిత్రాల్లో టాప్ హీరోలతో జత కట్టింది. ఇక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అమీజాక్సన్.. ఈ ఏడాది సంక్రాంతికి ‘మిషన్ చాఫ్టర్ 1’ మూవీతో తిరిగి కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మూవీస్ విషయం పక్కన పెడితే..త్వరలోనే అమీజాక్సన్ పెళ్లిపీటలెక్కబోతున్నది. హాలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎడ్ వెస్ట్‌విక్‌తో తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందమైన మంచు కొండల్లోని వంతెనపై వెస్ట్‌విక్ మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేసి అమీజాక్సన్ కి రింగ్ తొడిగినట్లుగా అందులో కనబడుతోంది. ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే, అమీజాక్సన్ గతంలో ఆండ్రెస్ పనయోట్టు అనే బిజినెన్‌మెన్‌తో లవ్ లో పడింది. 2019లో వారిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకొని...పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది అమీజాక్సన్. అయితే వీరిబంధం పెళ్లిదాకా సాగలేదు. కొన్ని వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. 2022లో పనయోట్టుతో బ్రేకప్ అయినట్లు అమీజాక్సన్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత నుంచి తన కొడుకు ఆండ్రూ ఆలనపాలన చూసుకుంటోంది అమీజాక్సన్.