Home > సినిమా > నాని ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..త్వరలో 'దసరా 2'

నాని ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..త్వరలో 'దసరా 2'

నాని ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..త్వరలో దసరా 2
X

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. పోయిన ఏడాది దసరా, హాయ్ నాన్న అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. డిఫరెంట్ జానర్స్‌లో వచ్చిన ఆ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు నాని చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో దసరా మూవీకి సీక్వెల్ కూడా ఉంది. త్వరలోనే దసరా2 సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన దసరా మూవీలో నాని ఫుల్ మాస్‌గా కనిపించాడు. నాని ఆ రేంజ్ సినిమా చేయడం అదే తొలిసారి.

కథ కొత్తగా ఉండటంతో పాటు మాస్, యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో దసరా పండగకు ఆ మూవీ భారీ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ 120 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే సినిమా చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేయలేదు. తాజాగా టాలీవుడ్‌లో దసరా సీక్వెల్‌కు సంబంధించి టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కథను కూడా ప్రిపేర్ చేశాడు.

దసరా మూవీ చివర్లో ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ధరణి తన ఊరి కోసం, తన ఫ్రెండ్స్ కోసం ఊర్లో ఉన్న బార్‌ను మూయించేస్తాడు. ఆ సమయంలో కీర్తి సురేష్‌తో పెళ్లి ప్రయాణం సాగుతుంది. మరి ఈ కథలో ఇంకో కొత్త పాయింట్‌తో దసరా 2 వస్తుందా? లేక ఆ కథకు సీక్వెల్ ఉంటుందా? అనేది చూడాలి. నాని కెరీర్‌లోనే పక్కా మాస్ సినిమాగా దసరా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు దసరా 2 రానుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి నాని మరోసారి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Updated : 27 March 2024 6:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top