Extra - Ordinary Man Trailer : ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ ట్రైలర్ రివ్యూ
X
నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. వక్కంతం వంశీ దర్శకుడుగా ఫస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అయింది. దీంతో అతనికి మళ్లీ దర్శకత్వ అవకాశం రావడానికి చాలా టైమ్ పట్టింది. ఇటు నితిన్ కూడా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. దీంతో ఈ కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పుడు పెద్దగా ఆసక్తి చూపించలేదెవరూ. బట్ ఫస్ట్ సాంగ్ తో ఆకట్టుకున్నారు. టీజర్ తో మెప్పించారు. లేటెస్ట్ గా ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్ లా ఉంది. వక్కంతం ఫస్ట్ మూవీకి భిన్నంగా ఈ సారి పూర్తిగా వినోదాన్ని నమ్ముకున్నాడు. నిజానికి వంశీ ఈ జానర్ లో కూడా మంచి పట్టు చూపిస్తాడు. అందుకే ట్రైలర్ హిలేరియస్ గా వచ్చింది.
అంతా ఊహించినట్టుగానే నితిన్ ఈ మూవీలో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గానే నటించాడు. అది అతనికి చిన్నప్పటి నుంచీ ఉన్న అలవాటులా చెబుతూ.. ‘‘ నాకు నేనంటే బోర్ అమ్మా.. ఎప్పుడూ ఇంకోలా ఉండాలనిపిస్తుంది.. రోజుకొకలా.. ’’ అనే నితిన్ చిన్నప్పటి డైలాగ్ క్యారెక్టరైజేషన్ కు బాగా సెట్ అయింది. ఈ కారణంగానే జూనియర్ ఆర్టిస్ట్ లా ఎప్పుడూ ‘వెనకే’ ఉండేందుకు ఇష్టపడుతుంటాడు. ఇక నితిన్ డైలాగ్స్ అన్నీ ఫుల్ ఫన్ గా ఉన్నాయి. షూటింగ్స్ లో బాలయ్య ఫ్యాన్స్ ను కొడతాడని తన బామ్మకు షూటింగ్ విశేషాలు చెప్పడం బలే ఉంది.
నితిన్ తండ్రిగా నటించిన రావు రమేష్ చెప్పిన‘‘ భవిష్యత్తు గతమైపోయిన వర్తమానంలో బ్రతుకుతున్నావురా.. అర్థమవుతుందా.. ’’ అనే డైలాగ్ అదిరిపోతే ఆ తర్వాత నితిన్ కౌంటర్ గా ‘‘ పోయొటిక్ గా ఉందిగానీ పొన్నియన్ సెల్వన్ లాగా అర్థం కావడం లేదు నాన్నా.. ’’ అని చెప్పడం నవ్వులు పంచింది. ఆ వెంటనే ట్రైలర్ నెక్ట్స్ టర్న్ తీసుకోవడం.. విలన్ ఎంట్రీ.. ఆ పాత్రలతో పాటు నితిన్ జర్నీ ఇవన్నీ కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ లా ఉన్నాయి. ఆ విలన్ కు ఈ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కు మధ్య వైరం ఎక్కడ ఎందుకు ఎలా మొదలవుతుంది.. దాని వల్ల జరిగిన పరిణామాలేంటీ అనేది సినిమాలో తెలుస్తుంది.
ట్రైలర్ అయితే మాత్రం కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అక్కడక్కడా నితిన్ భీష్మ మూవీని గుర్తుకు తెచ్చినా డైలాగ్స్ తో కామెడీ పేలింది కాబట్టి ఈ మూవీ నితిన్ తో పాటు వక్కంతం వంశీకి కూడా వర్కవుట్ అయ్యేలానే ఉందని చెప్పాలి. అన్నట్టు ట్రైలర్ లో శ్రీలీలకు పెద్దగా స్పేస్ లేకపోవడం విశేషం.