Home > సినిమా > Fake : రోజాకు సన్నీలియోన్ కౌంటర్ అంటూ బీభత్సమైన ట్వీట్!

Fake : రోజాకు సన్నీలియోన్ కౌంటర్ అంటూ బీభత్సమైన ట్వీట్!

Fake : రోజాకు సన్నీలియోన్ కౌంటర్ అంటూ బీభత్సమైన ట్వీట్!
X

ఏపీ పర్యాటక శాఖ మంత్రి, సినీ నటి రోజా రాజకీయాల్లోకి అనవసరంగా మాజీ శృంగారతార సన్నిలియోన్‌ను లాగి చిక్కుల్లో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ, ‘‘సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లు ఉంది’’ అని మంత్రి మాట్లాడడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెతున్నాయి. కొందరు రోజాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్తల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాన్ని మరింత ముదరబెడుతూ సన్నీలియోన్ పేరుతో ఉన్న ఓ ఫేక్ అకౌంట్ నుంచి దిమ్మతిరిగే ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ సన్నీలియోన్ చేయకపోయినా ఆమె స్పందిస్తే ఎలా ఉంటుదో అచ్చం అలాగే ఉండడంతో తెగ వైరల్ అవుతోంది.

‘‘నేను మాజీ శృంగారతారను. నా గతం గురించి నేనెప్పుడూ రవంత పశ్చాత్తాపపడలేదు. చేయాలనుకున్నది సరే బహిరంగంగానే చేశాను. నీకూ నాకూ తేడా ఏమంటే నేను నేను ఇండస్ట్రీని వదిలేశాను. నవ్వు వదిలేయలేదు’’ అని ఆ ట్వీట్లో ఉంది. దీనికి కొందరు రోజా, సన్నీలియోన్ గురించి మాట్లాడుతున్న వీడియో క్లిప్పును జత చేశారు. ఇది జనసేన, టీడీపీ శ్రేణులు పనే అయ్యుంటుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై రోజా భావోద్వేగంతో స్పందించారు. ‘‘వైఎస్ భారతమ్మ నీ భర్తకు నువ్వు కాస్త సంస్కారం నేర్పించమ్మా లేదంటే నేను నేర్పిస్తాను’’ అని పవన్ అన్నారు. దీనిపై రోజా ఘాటుగా బదులిస్తూ ‘‘పవన్ కల్యాణ్ జగన్‌కు సంస్కారం నేర్పిస్తాడంట. ఎలా ఉందంటే.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లు ఉంది. జగన్ సంస్కారవంతుడు, తండ్రిని మించిన తనయుడు’’ అని రోజా చెప్పుకొచ్చారు.


Updated : 15 July 2023 10:15 PM IST
Tags:    
Next Story
Share it
Top