ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్
X
విజయ్ దేవర కొండ (Vijay Dewara Konda),మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్ శరవేగంగా ఘాటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్డీఆర్, కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో దేవర సినిమా వాయిదా పడినట్లు టాక్. తొలుత 'ఫ్యామిలీ స్టార్' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే... బరిలో నాలుగైదు సినిమాలు ఉండటంతో వెనక్కి వెళ్ళింది. ఒక విధంగా అలా వెళ్ళడం వల్ల చాలా మంచి జరిగింది..బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ది ఫ్యామిలీ స్టార్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur), ఇతర మెయిన్ కాస్ట్ పాల్గొననున్న ఈ షెడ్యూల్ అయిదు రోజుల పాటు జరగనుందని సమాచారం.
విజయ్-మృణాల్ పెయిర్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ సినీ అభిమానుల్లో ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) సినిమాని సంక్రాంతి నుంచి తప్పించిన మేకర్స్… ఇప్పుడు ఏప్రిల్ 5న దేవర రిలీజ్ (Devara release) కాకుంటే ఆ డేట్ పై ఖర్చీఫ్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 5న దేవర రాకుండా దేవరకొండ థియేటర్స్ లోకి వచ్చేఛాన్స్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఈమూవీ ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. వాస్తవానికి ఈ మూవీని ఇటీవల సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన మేకర్స్, షూట్ ఆలస్యం కారణంగా రిలీజ్ ని కొన్నాళ్ళు వాయిదా వేశారు. ఇక నేడు తమ మూవీ యొక్క న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు ఫ్యామిలీ స్టార్ మేకర్స్. కాగా ఈ మూవీ ఏప్రిల్ 5 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేసారు.