Home > సినిమా > మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న మెగాస్టార్

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న మెగాస్టార్

మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న మెగాస్టార్
X

ఒక సినిమా హిట్ అవగానే అందులోని పాత్రలను మిస్ చేసుకున్న వారి గురించి బయటకు వస్తుంది. ఇది ఫలానా వాళ్ళు రిజెక్ట్ చేశారు. లేదా మిస్ చేసుకున్నారు లాంటి న్యూస్ లు వస్తూ ఉంటాయి. అవి చాలా మట్టుకు నిజాలే అవుతుంటాయి కూడా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ విషయం చాలా కామన్. స్టార్ హీరోలు సైతం ఇందుకు అతీతులేం కాదు. కొన్ని సార్లు ఆ పాత్రలు తమకు సెట్ కావని వదిలేస్తుంటారు. తీరా చేస్తే అవి బ్లాక్ బస్టర్ హిట్ అయి కూర్చుంటాయి. అలా చిరంజీవి విషయంలో కూడా రీసెంట్ గా జరిగిందట. అసలే భోళా శంకర్ ఫ్లాప్ అయిందని తెగ బాధపడుతున్న మెగా అభిమానులు ఇప్పుడు ఈ వార్త విని కూడా అయ్యో చిరు అని విచారిస్తున్నారు.





రాజ్ అండ్ డీకె దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ నటించిన పాత్రకు ముందు చిరంజీవినే అనుకున్నారుట. చిరు అప్పుడే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150తో హిట్ కొట్టి ఉన్నారుట. ఆ టైమ్ లో రాజ్ అండ్ డీకె వెళ్ళి ఫ్యామిలీ మ్యాన్ కథను మెగాస్టార్ కు వినిపించారుట. అశ్వనీదత్ కూడా వాళ్ళతో పాటూ కలిసారు. మెగాస్టార్ కి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చేసింది.





ఫ్యామిలీ మ్యాన్ లో మనోజ్ బాజ్ పాయ్ క్యారెక్టర్ గూడఛారి తరహా పాత్ర. మంచి యాక్షన్ ఉండే స్కోప్ ఉంది. కానీ అతని భార్యకు ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇవి చిరంజీవికి నచ్చలేదుట. ఆయన కోసమని పిల్లలను తీసేయడానికి కూడా సిద్దపడ్డారుట డైరెక్టర్స్. కానీ చిరు అప్పుడే రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటి టైమ్ లో ఇలాంటి స్క్రిప్ట్ సెట్ అవుతుందో లేదో అని ఆలోచించి ఆగిపోయారుట. ఇప్పుడు ఈ విషయాలన్నీ అశ్వనీదత్ రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలన్నీ తలుచుకున్నారు.

అశ్వనీదత్ మాటలు విన్న మెగా ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. మంచి ఛాన్స్ ను చిరు మిస్ చేసుకున్నారని వాపోతున్నారు. ఎందుకంటే తరువాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. అందులోనూ ఆచార్య, తాజాగా వచ్చిన భోళా శంకర్ లు అయితే డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి కూడా. అందుకే చిరంజీవి ఇప్పటికైనా ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తే బావుంటుందని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ లాంటివి అయితే గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.


Updated : 30 Aug 2023 3:55 PM IST
Tags:    
Next Story
Share it
Top