'ఫ్యామిలీ స్టార్' హిట్ కావాలని దిల్‌రాజ్ ఆఫీస్‌లో హోమం
X
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ ఫ్యామిలీ స్టార్. గీతగోవిందంతో హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురాం ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ దేవరకొండతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ పెంచారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 28న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మూవీ రిలీజ్‌కు మరో 8 రోజులే ఉండటంతో సినిమా భారీ హిట్ సాధించాలని దిల్ రాజు ఆఫీస్‌లో హీరో విజయ్ హోమం నిర్వహించారు. దిల్ రాజుతో పాటుగా శిరీష్ ఆ హోమం చేశారు. వేద పండితులు దగ్గరుండి ఆ హోమాన్ని జరిపించారు.
విజయ్‌కి ఈ మూవీ సక్సెస్ ఇప్పుడు ఎంతో అవసరం ఉంది. ఆ మధ్య పూరీతో చేసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి మూవీ అంతంత మాత్రంగా ఆడింది. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండకు సరైన హిట్ కావాలి. అందుకోసమే ఇలా హోమం చేశాడని అనిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు హోమం చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Divine blessings and positive vibes ✨
— Vamsi Kaka (@vamsikaka) March 27, 2024
Team #FamilyStar conducted a homam at SVC office ❤️#FamilyStarTrailer out tomorrow ❤️🔥❤️🔥#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/wXNjKnV6C7