Home > సినిమా > శోభన్ బాబును కొట్టిన ఆ ప్రముఖ దర్శకుడు ఎవరు.. ?

శోభన్ బాబును కొట్టిన ఆ ప్రముఖ దర్శకుడు ఎవరు.. ?

శోభన్ బాబును కొట్టిన ఆ ప్రముఖ దర్శకుడు ఎవరు.. ?
X

శోభన్ బాబును కొట్టిన దర్శకుడు.. ఈ టైటిల్ వినగానే ముందు ఎవరికైనా కోపం వస్తుంది. ఇది నిజం కాదు. అబద్ధాలు చెబుతున్నారు అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం ఆయా వ్యక్తుల మీద ఉండే ప్రేమ, అభిమానమే కారణం. ఈ రెండూ ఉన్నాయి కాబట్టి కొన్ని వార్తలు అబద్ధం అనిపించడంలో తప్పూ లేదు. బట్ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబును చెంప దెబ్బ కొట్టేంత కోపం రావడం అంటే విషయం పెద్దదైనా అయి ఉండాలి.. లేదా సదరు దర్శకుడు విపరీతమైన కోపిష్టి అయినా అయి ఉండాలి. యస్.. ఇప్పుడంటే ఆర్టిస్టులను కొట్టే డైరెక్టర్ అనగానే మనకు తేజ గుర్తొస్తున్నాడు. తేజ కంటే ముందే అంతకు మించిన కోపం ఉన్న దర్శకుడు వి మధుసూదన్ రావు. తెలుగులో ఎన్నో మరపురాని చిత్రాలు రూపొందించిన దర్శకుడాయన. తను ఎంచుకున్న కథల మూలంగా అభ్యుదయ చిత్రాల దర్శకుడు కూడా అనిపించుకున్నాడు. దర్శకుడుగా ఎంత గొప్పవాడో.. కోపంలోనూ అంతే గొప్ప అనిపించుకున్నారు. ఆయనే శోభన్ రెండు సినిమాల సందర్భంలో రెండుసార్లు కొట్టారు.

మొదటిది 1971లో వచ్చిన కళ్యాణ మండపం సినిమా సందర్భంగా జరిగింది. నిజానికి అప్పటికే శోభన్ ఎస్టాబ్లిష్డ్ హీరో. తనకంటూ ఓ ఇమేజ్, రేంజ్ రెండూ వచ్చాయి. ఈ సినిమా సందర్భంలో ఓ సన్నివేశంలో మధుసూదన్ గారు అనుకున్న ఎక్స్ ప్రెషన్ ను శోభన్ బాబు పలికించలేకపోయారట. చాలా టేక్స్ తీసుకున్నా.. సరిగా లేదట. దీంతో అసలే కోపిష్టి అయిన మధుసూదన్ రావు గారు.. అందరి ముందే ఆయన చెంప చెళ్లు మనిపించారట. ఈ రోజుల్లో అయితే ఎలా ఉండేదో కానీ.. శోభన్ ముందు బాధపడ్డా.. మళ్లీ తనే వెళ్లి ఆయన్ని మరోసారి ఆ సన్నివేశం గురించి అడిగి ఇంప్రవైజ్ చేసుకుని ఆ తర్వాత ఒకే టేక్ లో షాట్ పూర్తి చేశాడట.

ఇలాంటిదే మరో సంఘటన 1978లో వచ్చిన మల్లెపూవు టైమ్ లో జరిగింది. ఈ చిత్రానికీ మధుసూదన్ రావే దర్శకుడు. మల్లెపూవు చాలా ఎమోషనల్ గా సాగే సినిమా. పార్క్ లో సాగే ఓ సన్నివేశంలో ఆ ఎమోషన్ దర్శకుడి ఊహకు తగ్గట్టుగా రావడం లేదట. దర్శకుడు నాలుగైదు సార్లు అడగటం.. మళ్లీ శోభన్ మిస్ అవడంతో కోపం పట్టలేక మరోసారి చేయి చేసుకున్నారట. అప్పుడూ శోభన్ బాబు లోపల ఫీలైనా.. మళ్లీ దర్శకుడి వద్దకు వెళ్లి మరోసారి చెప్పించుకుని సన్నివేశం ఆయనకు నచ్చేలా చేశాడట. ఈ రెండు సందర్భాల గురించీ నిర్మాత మురారి గతంలోనే చెప్పారు. పరిశ్రమలో ఆ కాలం వాళ్లకు బాగా తెలుసు అంటారు. నిజానికి మధుసూదన్ రావు చాలామందిపై చేయి చేసుకున్నారు అని చాలామందికి తెలుసు. కానీ శోభన్ బాబు లాంటి స్టార్ హీరోనూ చెంప దెబ్బ కొట్టాడు అంటే ఆయనంటే అప్పట్లో ఎంత భయపడేవారో వేరే చెప్పక్కర్లేదేమో..

Updated : 23 March 2024 7:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top