Home > సినిమా > అన్న–అన్నయ్య నన్ను క్షమించు– చిన్నికృష్ణ

అన్న–అన్నయ్య నన్ను క్షమించు– చిన్నికృష్ణ

అన్న–అన్నయ్య నన్ను క్షమించు– చిన్నికృష్ణ
X

మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌ చిరంజీవిగారిని ఈ రోజు ఆయన నివాసంలో కలిశాను. ఆయన ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించిన తీరుకు పులకించిపోయాను. గతంలో కొంతమంది ప్రోద్భలంతో నా జీవితంలోనే అత్యంత దారుణమైన బ్యాడ్‌టైమ్‌లో అన్నయ్యను నా నోటితో అనరాని మాటలన్నాను. జీవితంలో ఏ మనిషైనా టైమ్‌ బాగాలేనప్పుడు తెలియకుండానే తప్పులు చేస్తారు. నేను ఆ తప్పు చేశానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. భారతదేశం గర్వించదగ్గ రచయిత చిన్నికృష్ణ అని ఆయన ‘ఇంద్ర’ సినిమా సమయంలో అన్నమాటను గుర్తు చేసుకుంటూ ఆరోజే నా జన్మ ధన్యమైంది అంతటి గొప్ప స్టార్‌ మెగాస్టార్‌ నుండి వచ్చిన ప్రశంసతో. నేనే తప్పుగా ఆయనతో మాట్లాడిన రోజు తర్వాత మళ్లీ ఇదే ఆయన్ను కలవటం. అయినప్పటికి ఆయన ప్రేమలో అణువంతైన మార్పులేదు. ఆ గుణమే శివశంకర వరప్రసాద్‌ను చిరంజీవిని చేసింది. చిరంజీవిని మెగాస్టార్‌ చేసింది. ఇప్పుడు పద్మవిభూషణున్ని చేసింది. నేను ఆయన పట్ల చేసిన తప్పును భగవంతుని ముందు, నా స్నేహితులముందు, కుటుంబసభ్యులముందు ఎన్నిసార్లు చెప్పుకున్నానో నాకేతెలుసు. అదే విషయాన్ని ఆయన ముందు చెపితే అవన్నీ మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా తన స్టైల్లో తాను అక్కున చేర్చుకుని ఏం కథలు రాస్తున్నావు చిన్ని అని ఆప్యాయంగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి ఈ లైఫ్‌కి. మళ్లీ నాకు ఆయనకు ‘‘ఇంద్ర–2’’లాంటి ప్రాజెక్ట్‌ సెట్‌ అవ్వాలని అవుతుందని త్వరలోనే అలాంటి మంచి వార్త అందరు వింటారని అనుకుంటున్నా. అన్న అన్నయ్య క్షమించు...మీ సోదరుడు చిన్నికృష్ణ అని చిరంజీవిని కలిసిన తర్వాత తన ఆవేధనను పంచుకున్నారు చిన్నికృష్ణ...

Updated : 2 Feb 2024 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top