Home > సినిమా > ప్రేమలు బ్యూటీకి హారతులు..ఇవే తగ్గించుకుంటే మంచిది!

ప్రేమలు బ్యూటీకి హారతులు..ఇవే తగ్గించుకుంటే మంచిది!

ప్రేమలు బ్యూటీకి హారతులు..ఇవే తగ్గించుకుంటే మంచిది!
X

మలయాళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన 'ప్రేమలు' మూవీ తెలుగులో కూడా విడుదలై సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీలోని హీరోయిన్ మమిత బైజు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్ 'ప్రేమలు' మూవీతో వచ్చేసింది. అటు మలయాళంలో, ఇటు తెలుగులో కూడా ప్రేక్షకుల క్రష్ లిస్ట్‌లోకి చేరిపోయింది.

ఓ వైపు మమిత బైజు నటన, మరోవైపు క్యూట్ నెస్‌కు తెలుగు యువత ఫిదా అవుతున్నారు. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తెగ వైరల్ అయిపోతోంది. ఇకపోతే 'ప్రేమలు' మీమర్స్ మీట్‌లో అయితే హీరోయిన్ మమిత బైజుని ఆకాశానికెత్తేశారు. ఓ అభిమాని అయితే ఏకంగా హారతి ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ప్రేమలు' చూశాక మమిత బైజును ప్రేమించకుండా ఎవ్వరూ ఉండరని చెబుతూనే స్టేజీపైకి ఎక్కి ఓ పళ్లెంలో కర్పూరం వెలిగించి హారతి ఇచ్చాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మమిత బైజును చూసి ఫ్యాన్ చేసిన పనికి..'ఇవే తగ్గించుకుంటే మంచిది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Updated : 18 March 2024 1:22 PM IST
Tags:    
Next Story
Share it
Top