Sai Pallavi : సోదరి ఎంగేజ్మెంట్లో రౌడీబేబి మాస్ డ్యాన్స్..మాములుగా లేదుగా!
X
ఇప్పుడున్న హీరోయిన్లలో డ్యాన్స్ బాగా చేసేది ఎవరు అనగానే..ముందుగా గుర్తువచ్చే పేరు ఇంకెవరు మన రౌడీ బేబి సాయిపల్లవినే. ఆమె సినిమాల్లో స్టేప్పులు వేసిన అన్ని సాంగ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఇక ఆమె ఇంట్లో పెళ్లి అంటే కాలు కదపకుండా ఎలా ఉంటుందా! హీరోయిన్ సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కు ఇటీవల తన ప్రియుడితో నిశ్చితార్థం జరిగింది. ఇరుకుటుంబాల సమక్షంలో సింపుల్ గా జరిగిన ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలు ఆమె చెల్లెలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే పూజా కన్నన్.. ఇటీవలే తన ప్రేమ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. తన ప్రియుడిని పరిచయం చేసి..ఆ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా జరగడంతో తొందరలోనే పప్పన్నం పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 21న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కన్నన్ ఇన్ స్టాలో పంచుకుంది. అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. చెల్లెలు ఎంగేజ్మెంట్ లో సాయిపల్లవి డ్యాన్స్ చేసిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో తన చెల్లెలు, కుటుంబసభ్యులతో కలిసి సాయిపల్లవి డ్యాన్స్ చేయడం చూడొచ్చు.
#SaiPallavi lights up the stage at her sister's engagement💃 pic.twitter.com/MCQrDFRaB8
— Gulte (@GulteOfficial) January 28, 2024