Home > సినిమా > అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ

అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ

అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ
X

పిచ్చి పీక్స్ కు వెళ్ళడం అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు కనీసం సినిమాలో ఎలా ఉంటాడో తెలియదు....కథేంటో తెలియదు కానీ మూవీ ప్రమోషన్స్ మాత్రం చేసేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తమ అభిమానానికి హద్దులు లేవు అంటూ నిరూపిస్తున్నారు.

ప్రాజెక్ట్ కె మూవీ మీద మొదటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హ్యాండ్ పోస్టర్స్, గ్లింప్స్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ హైప్ ను క్రియేట్ చేయడమే కాక...దాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు కూడా. ఈ పాన్ ఇండియా రేంజ్ సినిమాను పాన్ వరల్డ్ గా చేస్తున్నాడు. అందుకే ఈ మూవీ గ్లింప్స్ ను అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ వేదిక మీద రిలీజ్ చేయడానికిప్లాన్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్ కోసం ప్రభాస్, నాగ్ అశ్విన్, అమితాబ్, దీపికా అందరూ తరలి వెళుతున్నారు కూడా. ఈలోగా ఈరోజే ఇందులో హీరోయిన్ దీపికా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

గ్లింప్స్ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఆత్రం ఆగడం లేదు. అమెరికా అయినా...భీమవరం అయినా మా అభిమానం ఇంచు కూడా తగ్గనియ్యం అంటున్నారు. అందుకే అక్కడ కార్లతో హంగామా చేశారు. మిస్సోరీలోని సెయింట్ లూయీస్ లో కార్లతో ర్యాలీ చేశారు. ప్రాజెక్ట్ అనే డిజైన్ వచ్చేలా కార్లను పార్క్ చేశారు. వీళ్ళ హడావుడి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చాక... ట్రైలర్, మూవీ రిలీజ్ అయితే పిచ్చెక్కిపోతారో ఏంటో అంటున్నారు దీన్ని చూసివాళ్ళు. బాహుబలి తర్వాత ఒక్క సక్సెస్ కొట్టని ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ లతో తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అతని ఆశ నెరవేరాలని ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు.

Updated : 18 July 2023 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top