మహేష్ బాబుకు మర్చిపోలేని గిఫ్ట్
X
ఈరోజూ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఆయన బర్త్ డేకు అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మహేష్ జీవితంలో మర్చిపోలేని....ఆయన తర్వాత కూడా ఉండిపోయే కానుకను అందించారు.
మహేష్ బాబు పేరున ఒక నక్షత్రాన్ని రిజిస్టర్ చేయించారు ఆయన ఫ్యాన్స్. ఈ విషయాన్ని స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ్ అధికారికంగా తెలిపింది. RA:12H33M29S అని నక్షత్రానికి పేరు పెట్టారు. గెలాక్సీలో అత్యంత ఇష్టపడే నక్షత్రం ఇదే అని ఆయన అభిమానులు ప్రమేగా చెబుతున్నారు.
ఫ్యాన్స్ చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది అభిమానంతో చాలా పీక్స్ వరకూ కూడా వెళతారు. ఫ్యాన్స్ తమ హీరోల కోసం కొట్టుకోవడాలు చేస్తుంటారు. బ్లడ్ డొనేషన్లు, ఇతర డొనేషన్లు చేస్తుంటారు. తమ అభిమాన తారలకు గుడులు కడుతుంటారు. కానీ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ చేసింది మాత్రం అందరి కంటే డిఫరెంట్. ఇప్పటివరకూ ఏ నటుడికీ ఈ గౌరవం దక్కలేదు. ఇలా ఒక తెలుగు నటుడి పేరు మీద ఒక నక్షత్రం ఉండడం ఇదే తొలిసారి కావడంతో...ఆయన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.