Home > సినిమా > చై, సామ్.. నిహారిక, చైతన్య.. టాలీవుడ్కు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కలసి రావట్లే!

చై, సామ్.. నిహారిక, చైతన్య.. టాలీవుడ్కు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కలసి రావట్లే!

చై, సామ్.. నిహారిక, చైతన్య.. టాలీవుడ్కు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కలసి రావట్లే!
X

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న నాగ చైతన్య- సమంత, ఇవాళ నిహారిక- చైతన్య.. ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుని, క్యూట్ కపుల్ గా పేరు తెలచ్చుకున్న వాళ్లు వేరుపడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అచ్చి రావట్లేదు.. అందుకే విడిపోతున్నారనే వార్త అభిమానుల్లో తలెత్తింది. ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





సమంత- నాగ చైతన్య విడాకుల నుంచి టాలీవుడ్ ఫ్యాన్స్ ఇంకా తేరుకోకముందే.. మరో జోడి నిహారిక- చైతన్య విడిపోయారు. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న నిహారికకు.. చైతన్యతో విడాకులైంది. వీళ్లిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు అప్లై చేయగా.. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్ట్ విడాకులను మంజూరు చేసింది. అక్టోబర్ 6 2017 గోవాలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న లవ్ బర్డ్స్ చై-సామ్.. ఉన్నటుండి విడిపోయారు. దీంతో టాలీవుడ్ కు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కలిసి రావట్లేదని చర్చ మొదలయింది. ఫ్యాన్స్ దెబ్బతో.. ఇంకెవరైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలంటే భయపడేలా.. ఈ చర్చలు నడుస్తున్నాయి.







Updated : 5 July 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top