Home > సినిమా > హాస్పిటల్లో చేరిన ఖుష్బూ.. అసలేం జరిగిందంటే..?

హాస్పిటల్లో చేరిన ఖుష్బూ.. అసలేం జరిగిందంటే..?

హాస్పిటల్లో చేరిన ఖుష్బూ.. అసలేం జరిగిందంటే..?
X

ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా తన ట్విట్టర అకౌంట్ లో షేర్ చేశారు. ‘కోక్కిక్స్ (టైల్) బోన్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు వచ్చా. ప్రస్తుతం బాగానే ఉన్నా. కోలుకుంటున్నా. ఈ సమస్య త్వరలో పూర్తిగా నయం అవుతుందని ఆశిస్తున్నా’అని తెలిపింది. ఈ పోస్ట్ చూసిన ఖుష్బూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఖుష్బూ అనారోగ్యానికి గురై.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ‘జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసంతో బాధపడుతున్నా. నా లక్ బాగుండి ముందే మంచి హాస్పిటల్ లో చేరా. మీలో ఎవరికైనా హెల్త్ కొంచం బాగోలేదు అనిపించినా దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. మీ ఆరోగ్యాన్ని మొదట పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా టైం పడుతుంద’ని మొదట హాస్పిటల్ లో చేరినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 23 Jun 2023 8:19 PM IST
Tags:    
Next Story
Share it
Top