Samantha : 22 నెలల తర్వాత సినిమా వర్క్ స్టార్ట్..సమంత పోస్ట్ వైరల్
X
కొన్నాళ్లుగా సమంత సినిమాలు చేయడం లేదు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి హెల్త్‌పై ఫోకస్ పెట్టింది. అలాగే బిజినెస్‌లపై కూడా ఫోకస్ చేస్తోంది. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నానని సామ్ చెప్పుకొచ్చింది. సమంత చివరగా ఖుషీ సినిమా చేసింది. విజయదేవరకొండతో చేసిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత సామ్ సినిమాలేవీ థియేటర్లోకి రాలేదు. ఆ గ్యాప్‌లో సమంత ఓ సినీ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది.
ప్రస్తుతం సమంత చేతిలో ఏ సినిమాలు లేవు. దీంతో విదేశీ టూర్లలో సామ్ బిజీగా ఉంటోంది. ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. గతంలో రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో సమంత సిటాడెల్ అనే సిరీస్ చేసింది. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇండియన్ వెర్షన్‌లో సమంత చేసింది. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2 ఏళ్లు అవుతోంది. షూటింగ్ అయిపోయినా సమంత ఆరోగ్య సమస్యల వల్ల ఆ సిరీస్ ఆగిపోయింది.
తాజాగా సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్ మొదలెట్టినట్లు సమంత తెలిపింది. డబ్బింగ్ చెబుతున్న ఫోటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసింది. 22 నెలల తర్వాత ఆ ప్రాజెక్ట్ రెడీ అయ్యిందని సమంత చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ యాక్షన్, రొమాంటిక్‌గా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.