Home > సినిమా > పోలీస్ ఆఫీసర్‌గా జానీ మాస్టర్.. కొత్త సినిమా టైటిల్ ఇదే..

పోలీస్ ఆఫీసర్‌గా జానీ మాస్టర్.. కొత్త సినిమా టైటిల్ ఇదే..

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

పోలీస్ ఆఫీసర్‌గా జానీ మాస్టర్.. కొత్త సినిమా టైటిల్ ఇదే..
X


ప్రస్తుత స్టార్ హీరోలందరికీ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్న కొరియోగ్రాఫర్‌గా ‘జానీ మాస్టర్’ హీరో అయ్యాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ ఇండస్ట్రీల్లోని ఎన్నో సూపర్ హిట్ పాటలకు హీరోలతో స్టెప్‍లు వేయించిన ఈ మాస్టర్.. తన యాక్టింగ్ స్కిల్స్‌తో అదరగొట్టబోతున్నాడు. జానీ మాస్టర్ హీరోగా ప్రస్తుతం ‘రన్నర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. జానీ మాస్టర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న (జూలై 2) రన్నర్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‍ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. 'అరవింద్ 2' చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. 'రన్నర్' ఫస్ట్ లుక్ చూస్తే... ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే... మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా డిజైన్ చేశారు? ఆయన ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.





డైరెక్టర్ విజయ చౌదరి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ నగరంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకొని ఈ కథ అల్లుకున్నాం. ఇందులో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. మణిశర్మ పాటలకు జానీ మాస్టర్‌ వేసే స్టెప్పులు అదిరిపోతాయి. ఆయన ఇందులో పోలీస్‌గా కనిపిస్తారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. ఈనెల 20నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.




Updated : 3 July 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top