Home > సినిమా > Animal Movie: దటీజ్ సందీప్ అనిపించాడుగా

Animal Movie: దటీజ్ సందీప్ అనిపించాడుగా

Animal Movie: దటీజ్ సందీప్ అనిపించాడుగా
X

ఒకే సినిమాతో రెండు సార్లు, రెండు భాషల్లో ఫేమ్ అవడం అరుదు. అలాంటి అరుదైన సంఘటనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెరీర్ లో జరిగింది. అర్జున్ రెడ్డితో తెలుగులో గేమ్ ఛేంజర్ లాంటి మూవీని అందించాడు. అదే కథతో బాలీవుడ్ లోనూ కబీర్ సింగ్ గా బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ విజయమే రణ్ బీర్ కపూర్ తో యానిమల్ చేయడానికి కారణం అయింది. యానిమల్ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య వచ్చిన టీజర్ చాలా ఇంప్రెసివ్ అనిపించుకుంది. రణ్ బీర్ అగ్రెసివ్ రోల్ లో కనిపించబోతున్నాడని అర్థమైంది. ఇక రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ నుంచి అమ్మాయీ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.

ఏ పాటైనా కొన్ని సన్నివేశాలు చెప్పలేని పని చేస్తుంది. లేదా రెగ్యులర్ గా కనిపిస్తుంది. యానిమల్ లోని ఈ పాట చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ ను కూడా చూపిస్తుంది. తన ఫ్రెండ్ చెల్లినే(లేదా బంధువు) హీరో ప్రేమిస్తాడు. ఆ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరు. అయినా వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ అమ్మాయి తనతో ఉంటే తనకు ఆకాశంలో విహరిస్తున్న ఫీలింగ్ ఉంటుందా అనేలా ఆ పాటను ఒక పర్సనల్ ఫ్లైట్ లో స్టార్ట్ చేశాడు. వారి రోజు, రాత్రి ఆ విమానంలోనే అనేలా రాసుకున్న సన్నివేశాన్ని పాటలోని పదాలు హీరో ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తూ సాగాయి. ఇక తనతో ఉంటే ఆమెకు ప్రతి రోజూ అద్భుతమే అనుకునేలా చేస్తాడు అనేలా కళ్లు మూయించి ఒక్కసారిగా హిమాలయాల అందాలను చూపించడం సింబాలిక్ గా ఉంది. తమకు తోడెవరూ లేకపోయినా దేవుడే తోడు అనుకుంటూ ఇద్దరే ఆ హిమాలయాల్లోని శివాలయంలో పెళ్లి చేసుకోవడం అన్నీ సందీప్ మార్క్ డీటెయిల్స్ లా ఉన్నాయి. అలాగే ఈ ఫీలింగ్స్ అన్నీ సీన్స్ లో కన్వే చేయలేరు. అందుకే పాటగా సింపుల్ గా ఉన్నా ఎఫెక్టివ్ గా చూపించగలిగాడు. మొత్తంగా ఈ యానిమల్ తో సందీప్ మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అనే మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

Updated : 11 Oct 2023 7:29 PM IST
Tags:    
Next Story
Share it
Top