Home > సినిమా > పాయల్ రాజ్ పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ రిలీజ్

పాయల్ రాజ్ పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ రిలీజ్

పాయల్ రాజ్ పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ రిలీజ్
X

వైవిధ్యమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ అందిస్తారు. అలాంటి కథలు తెలుగు నుంచే వస్తే ఇంక ఎక్కువ ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్ లుక్ నుంచి ఓ కొత్త కంటెంట్ తో వస్తోన్న సినిమా అనేలా కనిపించిన చిత్రం 'తంత్ర'. తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వేల్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తోన్న సినిమా ఇది.

తాజాగా తంత్ర మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అనసూయ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యిందని... ఎంతో బిజీగా ఉన్నా కూడా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్పుత్ గారికి, అనసూయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి.

ఇక గతంలోనే విడుదల చేసిన తంత్ర మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చినా.. తంత్ర పూర్తిగా ఓ కొత్త బ్యాక్ డ్రాప్ తో సరికొత్త ఫీల్ ను కలగజేసే సినిమా అనిపించుకుంది. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది. ఈ ట్రైలర్ తో తంత్ర టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాతలు.

నటీనటులు :

అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల

టెక్నీషియన్స్ :

రచన మరియు దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి

నిర్మాణం: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరి

నిర్మాతలు : నరేష్ బాబు పి, రవి చైతన్య

సహ నిర్మాత : తేజ్ పల్లి

డిఓపి : సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల

ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ

ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్

మ్యూజిక్ : ఆర్ ఆర్ ధృవన్

సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా

సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్

VFX: ఎ నవీన్

DI కలరిస్ట్: పివిబి భూషణ్

సాహిత్యం: అలరాజు

పి ఆర్ ఓ : మధు VR


Updated : 12 Jan 2024 11:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top