Home > సినిమా > Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0.. హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0.. హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0.. హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..
X

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఊహించని మలుపులతో సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఉల్టాపల్టా కాన్సెప్ట్తో ప్రారంభమైన సీజన్ 7లో ఏ రోజు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే షోకు మరింత హైప్ తెచ్చేందుకు బిగ్ బాస్ టీం సరికొత్త ప్లాన్ చేసింది. గ్రాండ్ లాంఛ్ 2.0 పేరులో బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో ఐదుగురిని హౌస్లోకి పంపనుంది.

బిగ్ బాస్ సీజన్ 7 అతితక్కువ మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఈసారి కేవలం 14 మంది మాత్రమే హౌస్లో అడుగుపెట్టారు. షో ప్రారంభమై ఐదువారాలు పూర్తికాగా.. ఆదివారం ఎలిమినేట్ అయ్యే సభ్యులతో కలిసి హౌస్లో కేవలం 9 మంది మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ టీం సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. గ్రాండ్ లాంఛ్ 2.0లో భాగంగా ఐదుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ నయనీ పావని, సినీ నటి అశ్వినీ శ్రీ, సీరియల్ నటులు పూజా మూర్తి, అంబటి అర్జున్ తో పాటు సింగర్ భోలే షావలి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నారు. వాస్తవానికి పూజామూర్తి, అంబటి అర్జున్, భోలే షావలి సీజన్ ప్రారంభంలోనే బిగ్ బాస్ లోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే అనివార్య కారణాల వల్ల వారు హౌస్ లో ఎంట్రీ ఇవ్వలేకపోయారు.

నిజానికి సీజన్ 7 కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఏడుగురిని ఇంట్లోకి పంపుతారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం ఐదుగురిని మాత్రమే పంపారు. హౌస్ లోకి కొత్త సభ్యుల రాకతో ఆట మరింత రసకందాయంలో పడుతుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా పూజామూర్తి, అంబటి అర్జున్ ఇప్పటికే చెప్పలేనంత నెగిటివిటీ మూటగట్టుకున్న సీరియల్ బ్యాచ్లో చేరుతారా లేక వారి గేమ్ వారు ఆడుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.




Updated : 8 Oct 2023 6:36 PM IST
Tags:    
Next Story
Share it
Top