Home > సినిమా > షాక్ ఇచ్చిన బిగ్బాస్.. ఐదుగురు కంటెస్టెంట్స్ల మాస్ ఎంట్రీ

షాక్ ఇచ్చిన బిగ్బాస్.. ఐదుగురు కంటెస్టెంట్స్ల మాస్ ఎంట్రీ

షాక్ ఇచ్చిన బిగ్బాస్.. ఐదుగురు కంటెస్టెంట్స్ల మాస్ ఎంట్రీ
X

బిగ్బాస్ సీజన్ 7 విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కు ఇచ్చిపడేశాడు. కొత్తకుండానే వాతలు పెట్టాడు. తప్పు చేసినవాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం హౌస్ ను కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సండే ఫన్ డే కావడంతో.. సరదా ఆటలు ఆడించారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో చివర్లో ఓ సర్ ప్రైజ్ పెట్టాడు నాగార్జున. ఈ సీజన్‌లో ఎప్పుడూ, ఎక్కడా జరగనటువంటి విషయాలు జరగబోతున్నాయి. ఇది ఉల్టా పల్టా సీజన్ అన్న విషయం గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చాడు.

అదేంటంటే.. మరోవారంలో బిగ్ బాస్ 7 రెండో మినీ లాంచ్ అవనుంది. అంటే ఇంకొందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నమాట. అయితే సీజన్ మొదట్లో వినిపించిన పేర్లే ఇప్పుడూ వినిపిస్తున్నాయి. అంబటి అర్జున్‌, భోలె షావళి, అంజలి పవన్‌, పూజా మూర్తి, నయని పావని హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. అయితే ఆ ఐదుగురే వస్తున్నారా? లేక ఇంకొందరు ఎంట్రీ ఇస్తారా అనేది తెలియాలి. అంతేకాకుండా వీళ్ల ఎంట్రీని సరికొత్తగా ప్లాన్ చేస్తారా? లేద సడన్ గా హౌస్ లోకి అడుగుపెడతారా చూడాలి.


Updated : 1 Oct 2023 8:26 PM IST
Tags:    
Next Story
Share it
Top