Home > సినిమా > Folk Singer Narayanamma :ఈ నారాయణమ్మ గురించి తెలుసుకుంటే... ఇంటర్వ్యూ

Folk Singer Narayanamma :ఈ నారాయణమ్మ గురించి తెలుసుకుంటే... ఇంటర్వ్యూ

Folk Singer Narayanamma :ఈ నారాయణమ్మ గురించి తెలుసుకుంటే... ఇంటర్వ్యూ
X

మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న మైక్ టీవీ మరో ఆణిముత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. కనకవ్వ, రామతార వంటి ఎందరో జానపద గాయకులను తెలుగు ప్రేక్షకుల చెంతకు చేర్చిన మైక్ టీవీ ఆ కోవకే చెందిన అరుదైన గాయని, ఆధ్యాత్మిక గురువిణి నారాయణమ్మను మీకు పరిచయం చేస్తోంది.

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న నారాయణమ్మ కళాలమతల్లి ముద్దుబిడ్డ. జానపద గేయాలే కాకుండా జీవితసారాన్ని సులభంగా అర్థమయ్యే బోధించే ఆధ్యాత్మిక కీర్తనలు ఆమె కమనీయంగా పాడుతారు. చదువు లేకపోయినా తన గురువు దగ్గరి నుంచి నేర్చుకున్న శ్లోకాలు, పద్యాలు, తత్వగేయాలు అనర్గళంగా పాడే నారాయణమ్మ తన అంతరంగాన్ని, జీవన పయనాన్ని మైక్ టీవీతో పంచుకున్నారు. వేదాంత గురుపరంపర గీతాలను, అచల తత్వాలను, జానపదులు కష్టసుఖాలను పాడి వినిపించారు. రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామలో వడ్డెర కుటుంబంలో జన్మించిన నారాయణమ్మతో బుచ్చన్న ముచ్చటను ఈ మైక్ టీవీ ఫోక్ స్టార్స్ చానల్ లింకులో వినండి..

Updated : 25 Sept 2023 7:08 PM IST
Tags:    
Next Story
Share it
Top