Home > సినిమా > ఎవరయ్యా అన్నారు సమంత పని అయిపోయిందని..?

ఎవరయ్యా అన్నారు సమంత పని అయిపోయిందని..?

ఎవరయ్యా అన్నారు సమంత పని అయిపోయిందని..?
X

మయోసైటిస్ వంటి వ్యాధి బారిన పడిన సమంత తన శక్తినంతా ఏకం చేస్తూ, క్లిష్టతరమైన కసరత్తులు చేస్తూ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె కెరీర్‎లో దాదాపు హిట్ అయిన సినిమాలే ఎక్కవని చెప్పక తప్పదు. స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ సమంత. అలాంటిది సమంత నటించిన శాకుంతలం ఫ్లాప్ కాగానే ఇక సమంత పని అయిపోయిందని, తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని కొంత మంది ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి గట్టి కౌంటర్ ఇచ్చే ఘటన ఒకటి తాజాగా జరిగింది. భారత్‎లోనే కాదు అగ్ర రాజ్యంలోనూ సమంత క్రేజ్‎కు తిరుగులేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఆమె సినిమాల్లో యాక్ట్ చేస్తేనే కాదు, ఆమె ఒక్కసారి స్టేజ్ మీద కనిపిస్తే చాలు అనుకును అభిమానుల లిస్ట్ భారీగానే ఉంది. లేటెస్టుగా అమెరికాలో జరిగిన ఖుషి ఈవెంట్‌ సమంత స్టేజ్ మీద కనిపించింది కొన్ని నిమిషాలే అయినా, ఈవెంట్ మేకర్స్ భారీ మొత్తంలో ఈ భామకు చెల్లించుకున్నారట, ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్‎గా మారింది.





సమంత ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. మొదట సామ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసమే అమెరికాకు వెళ్లిందంటూ నెట్టింట్లో టాక్ బాగా వినిపించింది. కానీ ఈ బ్యూటీ 'ఇండియా డే పరేడ్' ఈవెంట్‎లో పాల్గొని అగ్రరాజ్యంలో హల్ చల్ చేసింది. ఇదిలా ఉంటే సామ్ , విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్‌ 1న పాన్‌ ఇండియా లెవెల్‎లో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరవుతుండటంతో విజయ్‌‎తో సహా మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్‎లో జరిగిన ఖుషి లైవ్‌ మ్యూజిక్ కన్సర్ట్‌ ఈవెంట్‎లో పాల్గొన్న సమంత ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయింది.





ఈ క్రమంలో శుక్రవారం న్యూయార్క్‌ సిటీలో ఖుషి ప్రమోషన్ ఈవెంట్‎ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఈవెంట్‎లో సామ్ స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచింది. కేవలం కొద్దిసేపు మాత్రమే సామ్ అక్కడ సందడి చేసినా ఆమెకు నిర్వాహకులు అక్షరాల రూ.30 లక్షల వరకు చెల్లించినట్లు టాక్ జోరుగా వినిపిస్తోంది. అంతే కాదు ఈ కార్యక్రమానికి ఫ్రీ ఎంట్రీ లేదట. ఈవెంట్‌ నిర్వాహకులు టికెట్లను రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించారు. రూ.2 లక్షల టికెట్‌ కొన్నవారు సమంతకు దగ్గర్లో కూర్చునే బంపర్ ఆఫర్ ఉంటుందట. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయట!. అది మరి సమంత క్రేజ్‌అంటే అని అభిమానులు అంటున్నారు.









Updated : 26 Aug 2023 9:23 AM IST
Tags:    
Next Story
Share it
Top