Home > సినిమా > Bigg Boss 7 : బిగ్ బాస్‎లో ఇదే తొలిసారి..నామినేషన్స్‎లో ఒకేసారి 9 మంది!

Bigg Boss 7 : బిగ్ బాస్‎లో ఇదే తొలిసారి..నామినేషన్స్‎లో ఒకేసారి 9 మంది!

Bigg Boss 7 : బిగ్ బాస్‎లో ఇదే తొలిసారి..నామినేషన్స్‎లో ఒకేసారి 9 మంది!
X

బిగ్ బాస్ సీజన్7 విజయవంతంగా రెండోవారం కొనసాగుతోంది. సెకెండ్ వీక్‏లో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. గత సీజన్లలో ఎప్పుడూ చూడని విధంగా ఈసారి నామినేషన్స్ వేరే లెవెల్‎లో ఉన్నాయి. ఈ నామినేషన్స్‎లో ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. సోమవారం స్టార్ట్ అయిన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగింది. నిన్న జరిగిన నామినేషన్స్‎తో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ వేడెక్కిపోయింది. సెప్టెంబర్ 11వ ఎపిసోడ్‍లో కంటెస్టెంట్స్ అందరూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను టార్గెట్ చేశారు. ఏకంగా 8 మంది రైతు బిడ్డను నామినేట్ చేశారు. మంగళవారం రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్ల మధ్య ఓ రేంజ్‎లో వార్ నడిచింది.

సెకెండ్ వీక్ లో హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 9 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, శోభా శెట్టి, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, షకీల, టేస్టీ తేజ, అమర్ దీప్ చౌదరి, ఆట సందీప్‎లు వారిలో అత్యధిక ఓట్లతో నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే వారి లిస్టులో ఉన్నారు. ఆడియన్స్ నుంచి ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ అన్నీ సీజన్లు ఒకలా ఉంటే ఈ సీజన్ మాత్రం వేరే లెవెల్. ముందుగా చెప్పినట్లుగానే అన్నీ ఉల్టా పల్టాగా ఉన్నాయి. అందుకే అంతకు ముందు సీజన్లలో లేని విధంగా 7వ సీజన్ నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్‍ను పిట్‍లో నిల్చోబెట్టి మిగతా వారితో నామినేట్ చేయించారు. ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారిజ . అలాగే రైతు బిడ్డను టార్గెట్ చేసినట్లుగా గతంలో ఎక్కడా ఒక కంటెస్టెంట్‎ను ఇంతలా టార్గెట్ చేయడం కనిపించలేదు. హౌజ్ లోని కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు.. రైతు బిడ్డ మాత్రం మరోవైపు అన్నట్లుగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. నామినేషన్స్ ముగిసిన తరువత కంటెస్టెంట్స్ అంతా పల్లవి ప్రశాంత్‍ను ఓదార్చడం ఈ ఎపిసోడ్‎లో కొసమెరుపు. ఇది పక్కన పెడితే మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ పోల్ ప్రారంభమైంది. మరి ఈ నామినేషన్స్‎లో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో వేచి చూడాల్సిందే.



Updated : 13 Sep 2023 7:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top