Home > సినిమా > తలైవా ఫ్యాన్స్ అంటే అట్లుంటది..ఉద్యోగుల కోసం 7 స్క్రీన్‎లు బుక్

తలైవా ఫ్యాన్స్ అంటే అట్లుంటది..ఉద్యోగుల కోసం 7 స్క్రీన్‎లు బుక్

తలైవా ఫ్యాన్స్ అంటే అట్లుంటది..ఉద్యోగుల కోసం 7 స్క్రీన్‎లు బుక్
X

సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఇండియా వైడ్‎గా ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి స్పెషల్‎గా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అదో పెద్ద పండుగలా జరుపుకుంటుంటారు ఫ్యాన్స్. తమిళనాడు ప్రజలైతే తలైవా అంటే పడి చచ్చిపోతుంటారు. ఆయన సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో చానాళ్ల తరువాత రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇవాళ విడుదలైంది. దీంతో తలైవా అభిమానుల సందడితో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ సీఈఓ రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో తన ఉద్యోగుల కోసం ఏకంగా 7 స్క్రీన్స్ బుక్ చేశాడు. వారంతా రజనీ సినిమా చూసేందుకు దాదాపు 2200 టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి నెట్టింట్లో వైరల్ గా మారింది.





చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఫ్రెషవర్క్స్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ సీఈఓ గిరీష్ మాతృభూతం రజినీకాంత్ వీరాభిమాని. ట్విటర్‏లో గిరీష్ రజనీకాంత్‏తో దిగిన ఫోటోలు కూడా చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రజనీ నటించిన జైలర్ సినిమా విడుదల కావడంతో గిరీష్ తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ కోసం స్పెషల్ షోలు వేయాలనుకున్నారు. అందుకోసం గిరీష్ ఏకంగా 7 స్క్రీన్లను బుక్ చేశారు. తమ కంపెనీలో పని చేసే 2200 మంచి ఉద్యోగుల కోసం ఈ టికెట్లు బుక్ చేశారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని సీఈఓనే తెలిపారు. ఇలా రజనీపై తన అభిమానాన్ని చూపించడం ఇది మొదటిసారి కానే కాదు. గతంలోనూ కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలు విడుదలైనప్పుడు తన ఎంప్లాయిస్ కోసం టికెట్లు బుక్ చేశారు. అప్పట్లో గిరీష్ పేరు తమిళనాట మారుమోగింది. రజిని ఫ్యాన్స్ ప్రసంశల వర్షం కురిపించారు. తాజాగా జైలర్ టికెట్స్ కూడా బుక్ చేసి మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు .







Updated : 10 Aug 2023 12:01 PM IST
Tags:    
Next Story
Share it
Top