Home > సినిమా > ప్రభాస్ కల్కి.. ఆ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉందన్న రాజమౌళి

ప్రభాస్ కల్కి.. ఆ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉందన్న రాజమౌళి

ప్రభాస్ కల్కి.. ఆ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉందన్న రాజమౌళి
X

ప్రభాస్ కల్కి 2898 AD మూవీ గ్లింప్స్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‎తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి గ్లింప్స్ అదిరిందంటూ సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి కల్కి గ్లింప్స్పై స్పందించారు. అయితే ఈ మూవీపై తనకు ఒకే ప్రశ్న మిగిలి ఉందని ట్వీట్ చేశారు.

‘‘గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్పై సినిమాలను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. కానీ మీరు ఆ సాహసం చేయడంతో పాటు సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాపై ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్” అంటూ జక్కన్న ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.

రాజమౌళి ట్వీట్పై పలువురు ఫన్నీగా స్పందిస్తున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రాజమౌళి ట్వీట్ కు ఫన్నీ రిప్లై ఇచ్చారు. ‘‘చూడండి.. రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారో’’ అని కామెంట్ చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమా తెరకెక్కించడానికి సంవత్సరాల టైం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయనపై శోభు యార్లగడ్డ సెటైరికల్ పంచ్ వేశారు. ఇక శోభు ట్వీట్కు రాజమౌళి ఫన్నీ రిప్లై ఇచ్చారు.

కల్కి విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయింది. కొన్ని దుష్ట‌శ‌క్తులు ప్ర‌జ‌ల‌ను బందీల‌ను చేయ‌డం, ఆ ప్ర‌జ‌లు ప‌డుతోన్న బాధ‌ల‌ను ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియో ఆరంభంలో చూపించారు. ఆ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టానికి ఉద్భ‌వించిన సూప‌ర్ హీరోగా ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చిన సీన్‌ ఫ‌స్ట్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ప్ర‌భాస్ లుక్‌, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి.

Look who is asking the release date !! 😆😆 https://t.co/owQff2ku0f

Updated : 22 July 2023 2:38 PM IST
Tags:    
Next Story
Share it
Top