Home > సినిమా > Rashmika Mandanna : కాబోయే భర్త అలా ఉండాలట..రష్మిక పోస్ట్ వైరల్

Rashmika Mandanna : కాబోయే భర్త అలా ఉండాలట..రష్మిక పోస్ట్ వైరల్

Rashmika Mandanna : కాబోయే భర్త అలా ఉండాలట..రష్మిక పోస్ట్ వైరల్
X

నేషనల్ క్రష్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన రష్మిక వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఈ మధ్యనే పాన్ ఇండియా సినిమా యానిమల్‌తో విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రష్మిక చేతిలో అరడజను సినిమాలున్నాయి. ప్రస్తుతం పుష్ప2 మూవీ షూటింగ్‌లో రష్మిక బిజీగా ఉంది. తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడింది. తన అభిమానుల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చింది.

రష్మిక అభిమాని ఒకరు..రష్మికకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అడిగారు. దీంతో ఆమె ఆ అభిమానికి తన మనసులోని విషయాలను చెప్పింది. తనకు కాబోయే భర్త స్పెషల్‌గా ఉండాలని, VD లాగానే ఉండాలని తెలిపింది. VD అంటే వెరీ డేరింగ్ అని అర్థమని, తనను కాపాడగలిగేవాడై ఉండాలని రష్మిక చెప్పుకొచ్చింది. అలాగే తాను క్వీజ్ కాబట్టి తనకు కాబోయే భర్త రాజులా ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టింది.

ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక తన పోస్ట్‌లో VD అని పెట్టడం, దానికి రష్మిక రిప్లై ఇవ్వడంతో చాలా మంది విజయదేవరకొండ అని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా విజయ్, రష్మిక మధ్య ఏదో ఉందని నెటిజన్లు పోస్టులు మీద పోస్టులు పెడుతున్నారు. రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ తరచూ ఒకే ప్రదేశంలో ఉంటున్నట్లు పలు ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో VD అని రష్మిక పోస్ట్‌లో పెట్టడంతో మరోసారి ఈ జంట నెట్టింట వైరల్ అవుతోంది.

Updated : 27 Feb 2024 10:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top