Gadar 2 collections: ఇండస్ట్రీ హిట్.. పఠాన్ రికార్డ్స్ బ్రేక్
X
షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా సూపర్ హిట్ కొట్టింది. హిట్ లేక కరువులో ఉన్న బాలీవుడ్ కు బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించింది. దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన చిత్రం గదర్-2. ప్రస్తుతం అన్ని థియోటర్లలో దూసుకుపోతుంది. ఆగస్ట్ 11న రిలీజ్ అయిన సినిమా ఇంకా థియోటర్లలో ఆడుతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ రాగా.. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. దీంతో ఈ సినిమా షారుక్ ఖాన్ పఠాన్ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
దేశంలో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా ఉన్న పఠాన్ ను వెనక్కినెట్టింది. ఈ క్రమంలో పఠాన్ రూ.524.53 కోట్లు లైఫ్ టైం కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఇప్పటివరకు గదర్-2 సినిమాకు రూ.542.75 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక షారుక్ తాజా సినిమా జవాన్ కూడా పఠాన్ రికార్డ్స్ తిరగరాసే దిశగా వెళ్తుంది. ఈ సినిమా ఇప్పటికే రూ.1000 కోట్లు వసూలు చేయగా.. కేవలం దేశంలోనే రూ.600 కోట్లు కొల్లగొట్టింది.