Home > సినిమా > ఆ ఒక్కరోజే సినిమాలు చూడ్డానికి రూ.140 కోట్ల ఖర్చు

ఆ ఒక్కరోజే సినిమాలు చూడ్డానికి రూ.140 కోట్ల ఖర్చు

ఆ ఒక్కరోజే సినిమాలు చూడ్డానికి రూ.140 కోట్ల ఖర్చు
X

ఓటీటీలు, వెబ్ సీరిస్‌లు వచ్చాక.. ఇక థియేటర్లకు ఎవరు వెళ్తారు? అదే ఖర్చుతో ఇంట్లోనే సినిమాలను చూసేయొచ్చు అనుకునే వారికి ఇది కచ్చితంగా షాకింగ్ న్యూసే. మంచి సినిమాలు రావడంతో ప్రస్తుతం థియేటర్‌లు కిక్కిరిసిపోతున్నాయి. సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు జనాలు థియేటర్‌లకు ఎగబడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ రేర్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. వందేళ్ల సినీ చరిత్రలో ఇప్పటివరకు చూడని ఈ రేంజ్ కెలెక్షన్స్ చూడలేదని స్వయంగా మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌లే తీర్మానించేస్తున్నాయి. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 రోజుల్లోనే దాదాపు రెండు కోట్లకు పైగా సినిమా టిక్కెట్‌లు అమ్ముడు పోయాయట. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ సినిమా హిస్టరీలో మంగళవారం సరికొత్త రికార్డు క్రియేట్‌ అయింది.





కేవలం మంగళవారం(ఆగస్టు 15) ఒక్కరోజే సినిమాలు చూడాడానికి ప్రేక్షకులు అక్షరాలా రూ.140 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఈ లెక్కలు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సన్ని డియోల్‌ నటించిన గదర్‌-2 సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. మంగళవారం ఒక్కరోజే ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్‌ చేసిందట. ఆ తర్వాత స్థానంలో రూ.42 కోట్లతో రజనీకాంత్ నటించిన జైలర్‌ నిలవగా.. రూ.20 కోట్లతో ఓ మైగాడ్‌ మూడో స్థానంలో నిలిచింది. భోళా శంకర్‌, ఓపెన్‌ హైమర్‌, రాణీకి ప్రేమ్‌ కహాని, బార్బీ, మిషన్‌ ఇంపాజిబుల్‌-7, మెగ్ సినిమాలు కలుపుకొన్ని ఒక ఇండిపెండెన్స్‌ డే రోజునే రూ.140 కోట్ల వసూళ్లు వచ్చాయట. ఇది ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలోనే ఓ అరుదైన రికార్డు అని ట్రేడ్ అనలిస్టులు అభివర్ణిస్తున్నారు.












Updated : 17 Aug 2023 1:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top