Home > సినిమా > కొత్త పార్లమెంట్లో ప్రదర్శించే మొదటి సినిమాగా..

కొత్త పార్లమెంట్లో ప్రదర్శించే మొదటి సినిమాగా..

కొత్త పార్లమెంట్లో ప్రదర్శించే మొదటి సినిమాగా..
X

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ లీడ్ రోల్ లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ సినిమా గదర్ 2. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు గదర్ 2 తీసుకొచ్చారు. ఈ సినిమాలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. భారత్- పాక్ బోర్డర్ గొడవలతో పాటు ఓ ప్రేమ కథను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్ట్ 11న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని విజయం సాధించింది. రూ.100 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా.. కేవలం రెండు వారాల్లోనే 400 కోట్ల క్లబ్ లోకి చేరి.. ఆల్మోస్ట్ 200 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఇప్పటికే 425 కోట్లు సంపాధించిన ఈ సినిమా.. త్వరలో 500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. దీంతో బాలీవుడ్ కు మరింత జోష్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో గౌరవాన్ని అందుకుంది. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శించే తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం (ఆగస్ట్ 25) ఉదయం 11 గంటల నుంచి మూడు రోజుల పాటు ఈ సినిమాను ఎంపీల కోసం కొత్త పార్లమెంట్ లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రసార హక్కులు దక్కించుకున్న జీ స్టూడియోస్.. రోజుకు ఐదు షోల చొప్పున మూడు రోజుల పాటు పార్లమెంట్ లో స్పెషల్ స్కీనింగ్ ఏర్పాటుచేసి ప్రదర్శిస్తున్నారు.

Updated : 26 Aug 2023 5:16 PM IST
Tags:    
Next Story
Share it
Top