Home > సినిమా > Game ON Movie : రిలీజ్కు రెడీ అయిన గేమ్ ఆన్

Game ON Movie : రిలీజ్కు రెడీ అయిన గేమ్ ఆన్

Game ON Movie : రిలీజ్కు రెడీ అయిన గేమ్ ఆన్
X

కొత్తదనం ఉన్న కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం ఓటిటిల కాలంలో ఉన్నాం కాబట్టి ఆ తరహా ఎగ్జైటింగ్ కంటెంట్స్ అంటే ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. ఫిబ్రవరి 2న విడుదల కాబోతోన్న ‘గేమ్ ఆన్’ అనే సినిమా కూడా అలాంటి వైవిధ్యమైన కథ, కథనాలతో వస్తోన్న సినిమానే. న్యూ ఏజ్ స్టోరీతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఇంతకు ముందు ‘రథ’ అనే సినిమాతో బాగా ఆకట్టుకున్న గీతానంద్ ఈ మూవీలో హీరోగా నటించాడు.తెలుగులో 90ఎమ్.ఎల్, భాగ్ సాలే, చలో ప్రేమిద్దాం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నేహా సోలంకి హీరోయిన్. రవి కస్తూరి నిర్మించిన ఈ చిత్రాన్ని దయానంద్ డైరెక్ట్ చేశాడు. ఈ స్టోరీ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే..

‘ సినిమాలోని పాత్రలన్నీ గ్రే షేడ్ లో ఉంటాయి.ప్రతి పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందట. కంటెంట్ పరంగా చూసుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ కుర్రాడు అనుకోకుండా రియల్ టైమ్ లో సాగే సైకలాజికల్ గేమ్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు. ఆ గేమ్ లోని టాస్క్ ను అతను ఎలా తీసుకున్నాడు.. అసలు ఆ గేమ్ ఎంచుకోబడటానికి కారణం ఏంటీ..? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు అనే అంశాలతో కథ, కథనం ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు మంచి ప్రేమకథ కూడా ఉంటుందని టాక్. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా రూపొందించామని చెబుతున్నారు మేకర్స్. మరి ఫిబ్రవరి 2న విడుదల కాబోతోన్న ఈ గేమ్ ఆన్ ఆడియన్స్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలి.


Updated : 6 Jan 2024 6:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top