ఆర్జీవి నా మొగుడు.. ఆ అక్రమ సంబంధంతోనే నేను పైకొచ్చా
X
ఒక విషయంలో ఎవరైనా హెల్ప్ చేస్తే.. వాళ్లను గురువులుగా, ఫ్యామిలీ మెంబర్ గా లేదా ఫ్రెండ్ గా భావిస్తాం. కానీ, దర్శకుడు వారణాసి సూర్య మాత్రం ఓ ఘాటు వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రామ్ గోపాల్ వర్మ తన మొగుడని.. ఆ అక్రమ సంబంధంతోనే తనను ఇండస్ట్రీలో పైకొచ్చానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ.. ఓ సినిమా పూర్తి కాదు. అలాంటిది జీరో బడ్జెట్ కాన్సెప్ట్ తో.. డైరెక్టర్ వారణాసి సూర్య గండ అనే సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ ఇవ్వాలని ఆర్జీవీని కోరితే.. ఆయన నిరాకరించడంతో రెచ్చిపోయిన సూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన డైరెక్టర్ సూర్య ‘నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్జీవీ నా మొగుడు. ఆయన ఇచ్చిన ఆలోచనతో జీరో బడ్జెట్ సినిమా తీశా. ఎవరు ఏమనుకున్నా సరే ఆయన నా మొగుడు. నాకు ఆయనకు మధ్య అక్రమ సంబంధం ఉంది. 10ఏళ్ల క్రితం ఆయనే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఆలోచన ఇచ్చారు. ఆయన కావాలని ఇచ్చారా.. నన్ను వదులుకుందామని ఇచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దాని వల్ల ఆర్టిస్టులైనా.. ఇండస్ట్రీ అయినా బాగుపడుతుందని ఆలోచించాడా.
ఆయనకు ఇష్టం వచ్చినట్లు బతికేస్తుంటానని చెప్తూ.. మీడియాను వాడుకుని బతికేస్తుంటాడు. అలాంటిది నేను ఇప్పుడు ఆర్జీవీని వాడుకుని బతకబోతున్నా. ఆయన జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఇవ్వకపోయుంటే.. మా ఊళ్లో షాప్ పెట్టుకుని బతికేవాన్ని. ఆ ఐడియాతోనే ఇప్పుడు గండ సినిమా చేశా. ఆయనకు బంధాలు, అనుబంధాలు ఉండవు కాబట్టి.. ఆయనతో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నా. దాంతోనే గండ అనే పిల్లను కన్నా. ఆ బిడ్డకు తండ్రి ఆర్జీవీనే. నా సినిమాను ప్రమోట్ చేయమని చాలాసార్లు వేడుకున్నా. కానీ, ఆయన వినిపించుకోలేదు. ఇప్పుడు నన్ను నువ్వు ఉంచుకో’ అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీని, డైరెక్టర్ సూర్యను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.