Home > సినిమా > పవర్ ప్యాక్ట్ యాక్షన్ మూవీగా గాండీవధారి అర్జున

పవర్ ప్యాక్ట్ యాక్షన్ మూవీగా గాండీవధారి అర్జున

పవర్ ప్యాక్ట్ యాక్షన్ మూవీగా గాండీవధారి అర్జున
X

మెగా వారసుడు వరుణ్ తేజ్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. పాపం అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. కరెక్ట్ గా ఈ టైమ్ లో వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. దీని ప్రీటీజర్ విడుదల అయింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న ఈసినిమా వరుణ్ తేజ్ కు హిట్ ఇచ్చేలానే కనిపిస్తోంది.

మొదటినుంచీ వరుణ్ ఢిఫరెంట్ సబ్జెక్ట్ లనే ఎన్నుకుంటూ వస్తున్నాడు. యాక్షన్, కామెడీ, సైంటిఫిక్ ఇలా అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడు. కానీ ఈ మెగా ప్రిన్స్ కు హిట్ లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ కోత్త మూవీతో వస్తున్నాడు వరుణ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫస్ట్ లుక్, టైటిల్ ఢిఫరెంట్ గా ఉండడంతో అందరికీ ఈ సినిమా మీద ఇంట్రస్ట్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రీటీజర్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది.

41 సెకెన్లు ఉన్న ప్రీ టీజర్ లో ఎక్కడా వరుణ్ ఫేస్ ను రివీల్ చేయలేదు. ఓన్లీ యాక్షన్ సన్నివేశాలను మాత్రమే చూపించారు. మేకింగ్ స్టైల్ అంతా హై రేంజ్లోనే ఉంది.ప్రతి షాట్ హై లెవెల్ స్టైల్లో అదిరిపోయింది. ఛేజింగ్ యాక్షన్ సీన్లతో నిండిపోయింది. ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు నానుంది. మొత్తం సినిమాను విదేశాల్లోనే షూట్ చేశారు. సినిమాలో యాక్షన్ సీన్సే హైలేట్ అని టీమ్ చెబుతోంది. వరుణ్ అయితే స్టైలిష్ లుక్ లో అదిరిపోతాడని అంటున్నారు.ఎస్వీసీసీ బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన గాండీవధారి అర్జున సినిమాలో ఏజెంట్ మూవీ హీరోయిన్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు.

Updated : 12 July 2023 5:34 PM IST
Tags:    
Next Story
Share it
Top