Home > సినిమా > ‘వేలమంది చావులు వృధా కాకూడదు.. ప్రపంచానికి నిజం తెలియాలి’: ఫుల్ యాక్షన్

‘వేలమంది చావులు వృధా కాకూడదు.. ప్రపంచానికి నిజం తెలియాలి’: ఫుల్ యాక్షన్

‘వేలమంది చావులు వృధా కాకూడదు.. ప్రపంచానికి నిజం తెలియాలి’: ఫుల్ యాక్షన్
X

ప్రవీణ్ సత్తారు డైరక్షన్లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవధారి అర్జున. ఈ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ రిలీజ్ ట్రైలర్ను ట్విటర్ ద్వారా లాంచ్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో భారీ బడ్జట్తో, హై టెక్నీకల్ వాల్యూస్తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మొత్తం పుల్ యాక్షన్తో నింపేశారు. ‘వేలమంది చావులు వృధా కాకూడదు.. ప్రపంచానికి నిజం తెలియాలి’ అంటూ స్టార్ట్ అయ్యే ట్రైలర్ చూస్తుంటే సినిమాపై హైప్ పెరిగిపోతుంది.





ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్పైగా కనిపిస్తుండగా.. ఇన్నాళ్లకు అతని పర్శనాలిటీకి తగ్గ క్యారెక్టర్ పడిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కిల్లింగ్ మిషన్గా మెగాప్రిన్స్ కరెక్ట్గా సరిపోయాడు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్స్, స్టంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ సినిమాతో డెబ్యూ చేసిన సాక్షి వైద్య హీరోయిన్గా చేసింది. చాలారోజులుగా వరుణ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడో లేదో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.






Updated : 21 Aug 2023 3:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top