Home > సినిమా > సరిపోయారిద్దరూ.. మాస్ బీట్లో శ్రీలీల, బాలయ్య

సరిపోయారిద్దరూ.. మాస్ బీట్లో శ్రీలీల, బాలయ్య

సరిపోయారిద్దరూ.. మాస్ బీట్లో శ్రీలీల, బాలయ్య
X

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తోంది. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన అఫీషియల్ టీజర్ వాటిని ఇంకాస్త పెంచాయి. మాస్ యాక్షన్ జోనర్లో సాగే భగవంత్ కేసరిలో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లో కేక పుట్టిస్తున్నారు. కాగా, బుధవారం (ఆగస్ట్ 30) మూవీ టీం సినిమా నుంచి గణేశ్ ఆంథమ్ పాట ప్రోమోను విడుదల చేసింది. శ్రీలీల డాన్స్ ఇరగదీస్తుందన్న విషయం తెలిసిందే. అయితే బాలయ్యతో ఈ ఫాస్ట్ బీట్ పాటకు ఎలా చేసింది, బాలయ్య పక్కన సరిపోయిందా చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఏడున్నర లక్షల మంది వీక్షించారు.






Updated : 30 Aug 2023 9:21 PM IST
Tags:    
Next Story
Share it
Top