Home > సినిమా > కపిల్ దేవ్ కిడ్నాప్.. ఇంతకీ ఎవరు చేశారు..?

కపిల్ దేవ్ కిడ్నాప్.. ఇంతకీ ఎవరు చేశారు..?

కపిల్ దేవ్ కిడ్నాప్.. ఇంతకీ ఎవరు చేశారు..?
X

"టీమిండియా ఫస్ట్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది". (Gautham gambhir) టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్.. షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. (Kapil Dev) ఇద్దరు వ్యక్తులు కపిల్‌ దేవ్‌ చేతుల్ని వెనక్కు కట్టి, మాట్లాడకుండా నోటిని గుడ్డతో కట్టేసి బలవంతంగా లాక్కెళ్లుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కపిల్ దేవ్‌ వెనక్కి తిరిగి సైగలు చేస్తూ కనిపించాడు.

కపిల్ కిడ్నాప్ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన గంభీర్.. ‘నాలాగే ఈ వీడియో ఇంకెవరికైనా వచ్చిందా?’ అని ప్రశ్నించాడు. ‘ఈ వీడియోలో ఉన్నది కపిల్‌ దేవ్ కాకూడదని అనుకుంటున్నాను. కపిల్‌ దేవ్ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ గౌతం గంభీర్‌ ట్వీట్ చేశాడు. గంభీర్ షేర్ చేసిన వీడియోపై నెట్టింట్లో జోరుగా చర్చ సాగింది. ప్రమోషన్‌ల కోసం కపిల్ ఇలాంటి వీడియోలు రిలీజ్ చేయడం ఏంటని కొందరు.. అది మార్ఫింగ్ వీడియో అని మరికొందరు కామెంట్ చేశారు.

వీడియో వైరల్గా మారడంతో కపిల్ మేనేజర్ రాజేశ్ పూరి స్పందించారు. అసలు విషయం బయటపెట్టారు. ఆ వీడియో ఓ యాడ్ షూట్ లో భాగమని, కపిల్ దేవ్ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ ప్రమోషన్ లో భాగంగా ఈ యాడ్ అని తేలడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమోషన్ వీడియోను సైతం గంభీర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

Updated : 26 Sep 2023 9:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top