Oscar awards 2024: ఆస్కార్ వేడుకలకు నిరసన సెగ
X
లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభమైన ప్రతిష్టాత్మక 96వ ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలకు నిరసన సెగ తగిలింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు ఆస్కార్ వేడుకలను తాకాయి. నిరసనకారులు డాల్బీ థియేటర్ వద్దకు చేరుకుని ఆదోళన చేపట్టారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఈ కారణంగా పలువురు ప్రముఖులు వేడుకకు ఆలస్యంగా హాజరయ్యారు. అయితే నిరసన జరుగుతుందని ముందే సమాచారం అందడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఈ క్రమంలో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. థియేటర్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు మద్దతుగా నిలవాలని వేడుకకు వచ్చిన ప్రముఖులను కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ అందుకున్న బిల్లీ ఇలిష్, ఫినియాస్.. గాజాకు మద్దతిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధరించారు. కాగా ఈసారి ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, నటుడు, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్, ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.