Geethanjali Malli Vachindi : స్మశానవాటికలో మూవీ టీజర్ లాంచ్.. టాలీవుడ్ చరిత్రలోనే..
X
అంజలి నటించి గీతాంజలి మూవీ అప్పట్లో మంచి సక్సెస్ను అందుకుంది. 2014లో వచ్చిన ఈ మూవీ నటిగా అంజలికి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ మూవీని శివ తుర్లపాటి డైరెక్ట్ చేస్తుండగా.. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంజలి 50వ మూవీగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ టీజర్ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ఫిబ్రవరి 24న ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ ఈవెంట్కు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అన్నీ సినిమాల్లాగా ఈ మూవీ టీజర్ను స్టూడియో లేదా థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు. స్మశానవాటికలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే స్మశానవాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలిచిత్రంగా గీతాంజలి మళ్లీ వచ్చింది నిలవనుంది. ఈ నెల 24న సాయంత్రం 7గంటలకు బేగంపేట స్మశానవాటికలో ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుక జరగనుందని మూవీ యూనిట్ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మశానవాటికలో టీజర్ లాంచ్ ఏంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻
— BA Raju's Team (@baraju_SuperHit) February 22, 2024
Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial pic.twitter.com/RhqvoifKB4