Riteish Deshmukh, : స్టేజీపై ఏడ్చేసిన జెనీలియా భర్త..
X
మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి, దివంగత నేత మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గురించి మాట్లాడుతూ స్టేజీపై ఏడ్చేసారు. తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రితీష్ మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్న చనిపోయి 12 ఏళ్లు అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే తన అన్నయ్య, లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ రితేష్ ను ఓదార్చారు.
సాహెబ్ లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉంటుంది. అతను ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడని...ఇప్పుడు కూడా ప్రకాశిస్తాడని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం బలంగా నిలచ్చు ఆయన గొప్పతనం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుందని ఎమోషనల్ అయ్యారు. కాగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆగస్టు 14, 2012న చనిపోయారు.
అయితే 2012లో హీరోయిన్ జెనీలియాను హీరో రితీష్ దేశ్‌ముఖ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చివరిగా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.