Home > సినిమా > Taapsee : త్వ‌ర‌లోనే తాప్సీ పెళ్ళి.. వరుడు ఎవరంటే?

Taapsee : త్వ‌ర‌లోనే తాప్సీ పెళ్ళి.. వరుడు ఎవరంటే?

Taapsee : త్వ‌ర‌లోనే తాప్సీ పెళ్ళి.. వరుడు ఎవరంటే?
X

ప్రముఖ హీరోయిన్ తాప్సీ పెళ్లికి సిద్దవుతున్నారని తెలుస్తోంది. తాప్సీ-మాథియాస్ వివాహం మార్చి నెలఖరులో జరుగుతుందని టాక్. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌ వేదికగా మ్యారేజ్ జరుగుతుందని సమచారం. ఇరు కుటుంబ సభ్యుల, ఫెండ్స్ మధ్య వీరి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.బాలీవుడ్ సెలెబ్రిటీలను చాలా తక్కువ మందినే ఆహ్వానించాలని అనుకుంటున్నారని టాక్. సిఖ్, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్పీ వంతు వచ్చింది. తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది.





తాప్పీ ప్రియుడు మథియాస్ వివరాల్లోకి వెళ్తే.. ఆయన డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ రిలేషన్ ప్రారంభమయింది.తాప్సీ 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదంతోనే తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత చాలా టాలీవుడ్ సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్ రేంజ్‍కు వెళ్లారు. తమిళం, మలయాళంలోనూ మూవీస్ చేశారు. 2013లో బాలీవుడ్‍లోనూ అడుగుపెట్టారు. పింక్ సినిమాతో హిందీలో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె టాలెంట్‍కు అందరూ ఫిదా అయ్యారు. అప్పుడప్పుడు తెలుగు చిత్రాలు కూడా చేశారు. అయితే, మూడేళ్లుగా ఎక్కువగా ఆమె బాలీవుడ్‍పైనే దృష్టి సారించారు.




Updated : 28 Feb 2024 1:06 PM IST
Tags:    
Next Story
Share it
Top