Home > సినిమా > లియో నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ గ్లింప్స్ వీడియో

లియో నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ గ్లింప్స్ వీడియో

లియో నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ గ్లింప్స్ వీడియో
X


కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం లియో. లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్ లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతో పాటు సాంగ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాస్టర్ తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.




యాక్షన్ కింగ్ అర్జున్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లియోలో ఆయన హెరాల్డ్ దాస్గా కనిపించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, అర్జున్ బర్త్ డేను పురస్కరించుకొని లియో మూవీ మేకర్స్ హెరాల్డ్‌ దాస్‌ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. అందులో అర్జున్ సిగరెట్‌ తాగుతూ ఊరమాస్‌ లుక్లో అదరగొట్టాడు.

లియో మూవీ నుంచి సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌ గ్లింప్స్ కూడా ఇప్పటికే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, శాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న లియో మూవీ అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాగా, లోకేశ్‌ కనగరాజ్‌, రత్న కుమార్‌, ధీరజ్‌ వైడీ డైలాగ్స్ అందించారు.



Updated : 15 Aug 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top