Home > సినిమా > గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే.. కామన్ డీపీ అదిరిపోయింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే.. కామన్ డీపీ అదిరిపోయింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే.. కామన్ డీపీ అదిరిపోయింది
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ కామన్ డీపీని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

ఇండియా సినిమాకి గేమ్ ఛేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేశాం. నిబద్ధతతో మెగాస్టార్ లెగసీని రామ్ చరణ్ గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లారు..అంటూ పోస్ట్‌లో ఓ నోట్ షేర్ చేసింది. దీంతో రేపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా డీపీలో అభిమానులందరూ ఆ డీపీలో ఉన్న పోస్టర్‌ను ఉంచనున్నారు.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రాసిన పొలిటికల్, డ్రామా నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ రానుంది. ఈ మూవీలో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర వంటివారు నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated : 26 March 2024 7:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top