Home > సినిమా > అల్లుఅర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పుష్ప 3లో అల్లు అయాన్

అల్లుఅర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పుష్ప 3లో అల్లు అయాన్

అల్లుఅర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పుష్ప 3లో అల్లు అయాన్
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప2 మూవీ షూటింగ్‌‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గతంలో పుష్ప మూవీకి జాతీయ అవార్డు సైతం అందుకున్నారు. ఇకపోతే బన్నీ కూతురు అల్లు అర్హ సమంత నటించిన శాకుంతలం సినిమాలో కనిపించింది. తాజాగా ఇప్పుడు బన్నీ కొడుకు అల్లు అయాన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలో అల్లు అయాన్ కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

పుష్ప3 మూవీలో అల్లు అయాన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ కిడ్‌గా అల్లు అర్హకు పేరొచ్చేసింది. పుష్ప3లో అల్లు అయాన్ కనిపిస్తే ఇక ఆ జాబితాలోకి చేరిపోతాడు. గత కొద్ది రోజుల ముందు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ పుష్ప3 గురించి లీక్ వదిలారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. పుష్ప2 ఓ రేంజ్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇప్పుడిప్పుడే అల్లు అయాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇటీవలె షారుఖ్ పాట పాడి ఇంకాస్త ఫేమస్ అయ్యాడని చెప్పాలి. ఇప్పుడిదే క్రేజ్‌తో పుష్ప2లో అయినా పుష్ప3లో అయినా అల్లు అయాన్ ఎంట్రీ ఇస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వాల్లో సినిమాలు చేయనున్నాడు.


Updated : 25 Feb 2024 9:54 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top