బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘పుష్ప 2’ టీజర్ డేట్ లాక్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప ది రూల్' పేరుతో వచ్చే సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫాస్ట్‌గా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15న ఈ పుష్ప2 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ నుంచి ఇది వరకే వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్ భారీ అంచనాలను పెంచాయి. ఎప్పటి నుంచో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పుష్ప2 అప్డేట్ గురించి అడుగుతూనే ఉన్నారు.
తాజాగా పుష్ప2 టీజర్ అప్డేట్ గురించి ఓ క్లారిటీ వచ్చేసింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్‌ని ఓ అభిమాని సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీంతో శరత్ ఆ అభిమానికి పుష్ప అప్డేట్ ఇచ్చాడు. పుష్ప2 టీజర్ బన్నీ బర్త్ డేకి వస్తుందని రిప్లై ఇచ్చాడు. దీంతో ఏప్రిల్ 8న పుష్ప2 టీజర్ రానుందని కన్ఫామ్ అయ్యింది. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న బన్నీకి వరుసగా గుడ్‌న్యూస్‌లు అందుతున్నాయి.
నేషనల్ అవార్డు రావడం, పాన్ ఇండియా వైడ్ గుర్తింపు రావడం, మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం పెట్టడం, సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ రావడం చూస్తుంటే పుష్ప మూవీ బన్నీకి బాగా కలిసొచ్చినట్లు అనిపిస్తోంది. ఇక పుష్ప2 రిలీజ్ అయితే రికార్డులు తిరగరాయడం పక్కా అని ఈపాటికే ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.