Kamala Hasan : రెండు రోజుల్లో ప్రకటిస్తా...కమల్ హాసన్
X
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విశ్వనటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్(Kamal Haasan) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని అన్నారు. తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లి తిరిగొచ్చిన ఆయన..చెన్నై ఎయిర్ పోర్టులో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే -ఎంఎన్‌ఎం మధ్య పొత్తుపై తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి కొద్దినెలల క్రితం డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) కొద్దిగా తెలిపారు. అలాగే ‘సనాతన ధర్మం’పై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు కమల్ హాసన్ మద్దతుగా నిలిచారు. అంతేగాక గత ఏడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికలో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థిని ఎంఎన్‌ఎం పార్టీ బలపరిచింది.
కాగా, 2018లో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీని స్థాపించారు. అయితే 2019, 2021లో జరిగిన లోక్‌సభ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఈ పార్టీ ప్రభావం చూపలేకపోయింది